ప్రమాదకరంగా పెన్నా..

ప్రమాదకరంగా పెన్నా..
X

somasila

ఎగువన కురుస్తున్న వర్షాలతో సోమశిల ప్రాజెక్ట్‌కు భారీగా నీరు చేరుతోంది. దీంతో సంగం, పెన్నా వారధి వద్ద పొర్లుకట్ట కోతకు గురవుతోంది. సోమశిల నుంచి అధికంగా నీరు వదలడంతో పెన్నా ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. కట్టపై ఉన్న దళితకాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న దాదాపు 100 కుటుంబాలు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడుతున్నారు. సోమశిల జలాశయానికి 78 TMCల నీరు చేరడంతో.. అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సంగం వద్ద పెన్నా ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ముందు జాగ్రత్త చర్యగా చేజర్ల, పొదలకూరు మండలాలకు అధికారులు రాకపోకలు నిలిపివేశారు.

Next Story