భార్యను హత్య చేసి.. హత్యకు గురయ్యాడు

కట్టుకున్న భార్యను హత్య చేసిన వ్యక్తిని గ్రామస్తులు అత్యంత కిరాతంగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫతేపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. ఫతేపూర్ చెందిన నషీర్ ఖురేషీ శుక్రవారం తన భార్యను నిధ్యం వేధించేవాడు.. ఆమెపై పలుమార్లు చిత్రహింసలకు గురిచేస్తూ దారుణంగా ప్రవర్తించేవాడు. ఇటీవల ఆమెను దారుణంగా హత్య చేశాడు ఖురేషీ . దీంతో శనివారం సాయంత్రం ఈ విషయం స్థానికులకు తెలిసింది. వారు ఖురేషీ భార్య తరుపు బంధువులకు సమాచారం అందించారు. దాంతో వారు వస్తే తనను ఏమైనా చేస్తారేమోనని బయపడి అతను పారిపోవడానికి ప్రయత్నించాడు.
విషయం తెలుసుకున్న బంధువులు తొలుత అతనిని పట్టుకున్నారు. తొలుత స్థంబానికి కట్టేసి రాళ్ల దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అప్పటికే అపస్మారక స్థితికి చేరుకున్న ఖురేషీని ఇసుప రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారు. అనంతరం నడిరోడ్డు మీదకు తీసుకువచ్చి మళ్ళీ విచక్షణారహితంగా కొట్టి చంపారు.. అయితే ఇంత జరుగుతున్నా అక్కడున్న వారెవరూ నోరు మెదపలేదు.. కనీసం వారిని ఆపి పోలీసులకు అప్పగించే ప్రయత్నం కూడా చేయలేదు. సమాచారం తెలుసుకున్న పోలీసులు భార్య, భర్తల మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఖురేషీని హత్య చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com