పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్

పింక్ రీమేక్ లో పవన్ కళ్యాణ్

ping

పవన్ కళ్యాణ్ ని మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద చూడాలనుకునే అభిమానులకు గుడ్ న్యూస్. పవన్ రీఎంట్రీ పై వినిపిస్తున్న రకరకాల వార్తలపై మాగ్జిమమ్ ఇక ఫుల్ స్టాప్ పడినట్లే.. అవును పవర్ స్టార్ రీ ఎంట్రీకి సంబంధించిన ఓ అఫిషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అది కూడా బాలీవుడ్ నుంచి ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్, పవన్ రీ ఎంట్రీ న్యూస్ ని కన్ఫామ్ చేస్తూ ట్వీట్ చేశాడు... పవన్ కళ్యాణ్ పింక్ సినిమాని రీమేక్ చేయడం పక్కా అని క్లారిటీ ఇచ్చాడు.

బాలీవుడ్లో పింక్ మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది. అందులో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించాడు. బోనీ కపూర్ నిర్మాత. ఈ సినిమాని నీర్కొండ పార్వై పేరుతో అజిత్ హీరోగా తమిళంలో రీమేక్ చేసి హిట్ కొట్టాడు బోనీకపూర్. ఇప్పుడు తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా, దిల్ రాజుతో కలసి బోనీకపూర్ తెలుగులో రీమేక్ చేయబోతున్నాడు. ఈ రీమేక్ కి డైరెక్టర్ వేణూ శ్రీరామ్. త్వరలోనే ఈ చిత్రం పట్టాలెక్కబోతుంది. ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాస్తున్నాడనే న్యూస్ కూడా వినిపిస్తుంది. త్వరలోనే పింక్ రీమేక్ పట్టాలెక్కబోతుంది.

Read MoreRead Less
Next Story