గుడ్ న్యూస్.. దీపావళి ఆఫర్ మరో నెల పొడిగింపు..
ఈ దీపావళి ఆఫర్ కింద రిలయన్స్ జియో రూ.1500 విలువ చేసే జియో ఫోన్‌ను కేవలం రూ. 699 కే అందిస్తోన్న
సంగతి తెలిసిందే. అయితే మూడు వారాలుగా డిమాండ్ ఉన్నందున జియోఫోన్ దీపావళి ఆఫర్‌ను మరో నెలకు పొడిగించాలని నిర్ణయించినట్లు రిలయన్స్ జియో శుక్రవారం తెలిపింది. కేవలం 699 రూపాయలకు జియోఫోన్‌ను అందిస్తోంది.. ఈ ఆఫర్ గత నెలలో దీపావళికి ముందు ప్రారంభం అయింది.
నవంబర్ లో కూడా ఈ ఆఫర్ కొనసాగనుంది. ఈ దీపావళి ఆఫర్‌ను ఫీచర్ ఫోన్ వినియోగదారులు అందరూ వినియోగించుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్‌ను పొడిగించాం.. 2జీ ఫోన్ వినియోగదారులు ఈ పొడిగింపుతో తమ ఖాతాదారులుగా మారుతారని ఆశిస్తున్నాం అంటూ జియో పేర్కొంది. జియో ఫోన్‌పై రూ. 800 తగ్గింపు, రూ.700 విలువైన డాటా, మొత్తం కలిపి రూ.1500 ప్రయోజనం అందిస్తోన్నట్టు కంపెనీ తెలిపింది. ఇప్పటివరకు కొనుగోలు చేయకుండా నూతనంగా కొనుగోలు చేసే జియోఫోన్‌పై రూ. 700 విలువ చేసే డాటాను అందిస్తున్నట్టు జియో స్పష్టం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com