వేధింపులకు మరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి

వేధింపులకు మరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలి
X

suicide

వేధింపులకు హైదరాబాద్‌లో మరో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని బలైపోయింది.. భర్త పెడుతున్న చిత్ర హింసలు భరించలేక అంబర్‌పేటలో శివానీ అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్ల క్రితం సుకీత్‌, శివానీ ప్రేమ వివాహం చేసుకున్నారు.. కొన్నాళ్లు కాపురం సాఫీగానే సాగినా.. ఆ తర్వాత శివానీపై వేధింపులు మొదలయ్యాయి.. మరో యువతితో ఎఫైర్‌ పెట్టుకున్న సుకీత్‌ నిత్యం శివానీని వేధిస్తున్నాడు.. చనిపోవాలంటూ చిత్రహింసలకు గురిచేశాడు..

భర్త వేధింపులు భరించలేక శివానీ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది.. ఆత్మహత్య చేసుకునే ముందు కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి మాట్లాడింది.. ఆ తర్వాత కొద్దిసేపటికే ప్రాణాలు తీసుకుంది.. కూతురి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.. శివానీ ఆత్మహత్యపైనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. సుకీత్‌, అతని కుటుంబ సభ్యులపై అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Tags

Next Story