ఐసిస్ కొత్త అధినేతపై ట్రంప్ కామెంట్

X

ఐసిస్ అధినేత అబు బకర్ ఆల్ బగ్దాదీని తమసైన్యం అంతమొందిందంటూ ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి వెల్లడించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఇప్పుడు కొత్త అధినేతపై కూడా కామెంట్ చేశారు. ఐసిస్ కు కొత్త నాయకుడు వచ్చాడు. అతడి గురించి మాకు బాగా తెలుసు అంటూ ట్రంప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆల్ బగ్దాదీని అమెరికా సైన్యం హతమార్చిన కొద్దిరోజులకే కొత్త నాయకుడు అబు ఇబ్రహీం ఆల్ హషిమ్ ఆల్ ఖురేషీని నియమించినట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్ ను కూడా విడుదల చేసింది. అమెరికాపై ప్రతికారం తీర్చుకుంటామంటూ హెచ్చరికలు జారీచేసింది. దీంతో కొత్తనాయకుడి గురించి తమకు తెలుసు అంటూ ట్రంప్ ట్విట్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
