ప్రాణాలు చిదిమేస్తున్న విష జ్వరాలు

ప్రాణాలు చిదిమేస్తున్న విష జ్వరాలు
X

dengu

కర్నూలు జిల్లాలో విష జ్వరాలు విజృంభిస్తూ ప్రజల ఉసురు తీస్తున్నాయి. తాజాగా డోన్‌ మండలం గానిగుంట్ల గ్రామంలో.. ఏడేళ్ల బాలికను డెంగ్యూ జ్వరం పొట్టనబెట్టకుంది. రామంచంద్రుడు కూతరు హేమలతకు 5 రోజుల క్రితం తీవ్రమైన జ్వరం రావడంతో కర్నూల్ లోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్చారు. బాలికకు డెంగ్యూ నిర్దారణ కావడంతో.. చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది. డెంగ్యూతో పోరాడిన హేమలత చివరికి ప్రాణాలు విడిచింది.

గ్రామాల్లో కలుషిత నీటివల్ల రోగాలు ప్రబలుతున్నా.. ఏ అధికారి పట్టించుకోవడంలేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు చెత్త కుప్పలు పెరిగి అపరిశుభ్ర పరిస్థితుల వల్ల దోమలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Tags

Next Story