స్కూల్లో చిన్నారులపై వార్డెన్‌ లైంగిక వేధింపులు

స్కూల్లో చిన్నారులపై వార్డెన్‌ లైంగిక వేధింపులు

school

స్కూళ్లు, హస్టళ్లలో చిన్నారులపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. తాజాగా ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరులోని ఓ ప్రైవేట్‌ స్కూల్లో ఒకటవ తరగతి విద్యార్ధులపై వార్డెన్‌ లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. వార్డెన్‌ వేధింపులపై చిన్నారులు తమ తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో.. వార్డెన్‌ లింగయ్యకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిందితున్ని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. లింగయ్యపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story