బీభత్సం సృష్టిస్తున్న మహా సైక్లోన్‌

బీభత్సం సృష్టిస్తున్న మహా సైక్లోన్‌
X

cyclone

అరేబియా తీరంలో ఏర్పడిన మహా సైక్లోన్ బీభత్సం సృష్టిస్తోంది. కేరళ, కర్నాటక తీర ప్రాంతాల్లో అలలు విరుచుకుపడుతున్నాయి. సముద్ర ఉగ్రరూపం దాల్చడంతో మత్స్యకారులు, పర్యాటకులు తీరంవైపు వెళ్లొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. మహా తుఫాన్‌ కారణంగా కేరళ, గోవాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

కేంద్ర పాలిత ప్రాంతం లక్ష్యద్వీప్‌లోనూ మహా సైక్లోన్‌ బీభత్సం సృష్టించింది. బలంగా గాలులు వీయడంతో తీరంలోని షెడ్లు నేలమట్టం అయ్యాయి. కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. నివాసాలను వర్షం నీరు చుట్టుముట్టింది. దీంతో స్థానికులు, పర్యాటకులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో లక్ష్యద్వీప్‌ ఐస్‌ లాండ్‌ జలమయం అయ్యింది. తుఫాను కారణంగా 100-110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరో నాలుగురోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్లేవారు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు.

తుఫాన్‌ నేపథ్యంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. ఆహారాన్ని, వాటర్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. తీర గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Next Story