అక్షరాలా రూ.28 కోట్లు గెలుచుకున్నాడు.. అడ్రస్ లేడు..

సరదాగా లాటరీ టికెట్ కొన్నాడు.. తనకేం వస్తుందిలే అనుకున్నాడో ఏమో.. .. ఏవో రెండు ఫోన్ నెంబర్లు ఇచ్చాడు. తీరా చూస్తే అతడికే లాటరీ టికెట్ తగిలింది. అదీ ఒకటీ రెండూ కాదు.. ఏకంగా 15 మిలియన్ దీనార్లు (రూ.28.8 కోట్లకు పైగా) గెలుచుకున్నాడు. యూఏఈలోని అతిపెద్ద లాటరీ టికెట్లలో బిగ్ టికెట్ ఒకటి. దీనికి సంబంధించి అబుదాబి విమానాశ్రయంలో ఆదివారం నిర్వహించిన లక్కీ డ్రాలో అద్భుతం జరిగింది. లాటరీ గెలుచుకున్న వారంతా భారతీయులే కావడం విశేషం. ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు కేరళకు చెందిన శ్రీను శ్రీధరన్ నాయర్. అతడు లాటరీలో గెలుచుకున్న మొత్తం గురించి చెబుదామని ఫోన్ నెంబర్లకు చేస్తుంటే కలవట్లేదు. ఆ పేరున్న వ్యక్తి ఎవరో తమకు తెలియదని సమాధానం వస్తోంది. దీంతో నిర్వాహకులు శ్రీనును సంప్రదించడానికి మళ్లీ ప్రయత్నిస్తామని చెప్పారు. వీళ్లందరూ ఆన్‌లైన్‌లోనే ఈ లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com