జగన్ షాకింగ్ నిర్ణయం.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ

జగన్ షాకింగ్ నిర్ణయం.. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ
X

ap-cs

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం బదిలీ అయ్యారు. ఇన్‌చార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. బదిలీ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తుందని ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వులను ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్‌ జారీ చేశారు. HRD డైరెక్టర్‌ జనరల్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం నియమితులయ్యారు.

ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ప్రవీణ్ ప్రకాశ్‌ అంశంలో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేసినట్టు తెలుస్తోంది. అధికార పరిధిని అతిక్రమించారంటూ ప్రవీణ్ ప్రకాశ్‌కు సీఎస్‌ హోదాలో ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్ జారీ చేశారు. తన కార్యాలయ అధికారికే.. ఎల్వీ సుబ్రమణ్యం షోకాజ్‌ ఇవ్వడంపై సీఎం జగన్ సీరియస్‌ అయ్యారు. ఎల్వీని HRD డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేశారు. ఆయన స్థానంలో నీరభ్‌ కుమార్‌ ప్రసాద్‌కు ఇంఛార్జ్‌గా నియమించారు.

Tags

Next Story