సినిమా డైలాగులు.. పాలిటిక్స్‌లో పనికి రావు: పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి కామెంట్స్

సినిమా డైలాగులు.. పాలిటిక్స్‌లో పనికి రావు: పవన్‌ కళ్యాణ్‌పై మంత్రి కామెంట్స్
X

pawan-kalyan

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్‌పై ఏపీ మంత్రులు స్పందించారు. మంత్రి అవంతి విశాఖలో మాట్లాడుతూ.. పవన్‌ కాపు యువతను చెడగొడుతున్నారని విమర్శించారు. తాట తీస్తా, తోలు తీస్తా అనటం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి డైలాగ్‌లు సినిమాల్లో బాగుంటాయని రాజకీయాల్లో వాడొద్దని సలహా ఇచ్చారు. ఇసుకపై బహిరంగ చర్చకు తాను సిద్ధమన్నారు మంత్రి అవంతి శ్రీనివాస్‌.

మరోవైపు మంత్రి అనిల్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిపాలన బాగుంటే సినిమాల్లోకి వెళ్లిపోతానని పవన్‌ కల్యాణ్‌ చెప్పారన్నారు. ఇప్పుడు పింక్‌ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోందని అంటే రాష్ట్రంలో పరిపాలన బాగా ఉన్నట్టే కదా అని అన్నారు. విశాఖ లాంగ్‌ మార్చ్‌ అని పవన్‌ కారెక్కి నడిచాడన్నారు అనిల్‌. మళ్లీ ఎప్పుడు కనిపిస్తాడో తెలియని పవన్‌ కల్యాణ్‌ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు మంత్రి అనిల్‌.

Next Story