వెంకన్న సన్నిధిలో.. దళారీ దందా

వెంకన్న సన్నిధిలో.. దళారీ దందా
X

brokar

తిరుమల కొండపై మరో దళారి ఆటకట్టించారు టీటీడీ విజిలెన్స్‌ అధికారులు. వసతి గదులను అక్రమంగా పొంది.. వాటిని భక్తులకు విక్రయిస్తున్న దుర్గాకిరణ్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనికి ఏడుగురు టీటీడీ ఉద్యోగులతో సంబంధాలున్నట్టు గుర్తించారు. ఏఈవో స్థాయి అధికారి నుంచి అటెండర్ వరకూ పలువురితో లింక్‌లు పెట్టుకున్న దుర్గాకిరణ్‌ వారి ద్వారానే రూమ్‌లు పొందుతున్నాడు. రద్దీ సమయాల్లో రూమ్‌లు దొరక్క ఇబ్బందులు పడుతున్న వారిని టార్గెట్ చేసుకుని వాటిని విక్రయిస్తున్నాడు. తన కమీషన్ పోగా మిగతా డబ్బుల్ని తనకు సహకరిస్తున్న ఉద్యోగుల అకౌంట్లలో జమ చేస్తున్నాడు. ఇలా ఏడుగురి సాయంతో కొన్నాళ్లుగా ఇతను దందా సాగిస్తున్నట్టు విజిలెన్స్ విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో TTD ఉద్యోగులపై కూడా కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమైంది.

Tags

Next Story