మంత్రిగారూ.. మీరు గ్రేట్.. మీలా అందరూ పనిచేస్తే..

ఎలక్షన్లకు ముందు ఓట్ల కోసం ఇంటింటికీ తిరిగి ఎన్నెన్నో జిమ్మిక్కులు చేస్తారు.. పిల్లలకు స్నానాలు చేయిస్తారు.. బట్టలు ఉతుకుతారు.. నాట్లు వేస్తారు.. గెలిచిన తరువాత ఒక్క మినిస్టరూ అడ్రస్ ఉండరు. అయిదేళ్లకు ఒకసారి ఇదే తంతు. నియోజకవర్గ సమస్యలకోసం నిధులెన్నో శాంక్షన్ అవుతాయి. సమస్యలు మాత్రం పరిష్కారం కావు. చేసుకున్నోడికి చేసుకున్నంత ఖర్మ అన్నంత చందంగా.. ఓట్లేసి మరీ గెలిపించుకున్నాం కదా.. అయిదేళ్లు భరించక తప్పదు. అందరు మంత్రులు అలాగే ఉంటారా.. అంటే అక్కడక్కడా ఒకటి అరా కేసులు కొన్ని ఉంటాయి. మంత్రిని అన్న విషయం మరిచి పోయి పార చేత బట్టి మురుగు కాల్వలోకి దిగారు మున్సిపల్ మంత్రి ప్రధుమన్ సింగ్.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ నియోజకవర్గానికి చెందిన మంత్రి తన నియోజకవర్గంలో పర్యటిస్తూ సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. మురుగునీటితో పొంగి ప్రవహిస్తున్న కాలువ ఒకటి తన కంట పడింది. వెంటనే కాలువలోకి దిగి.. పార తీసుకుని మట్టిని, చెత్తను తొలగించారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు. అధికారులు కూడా ప్రజలకు ఈ అంశంపై అవగాహన కల్పించాలని సూచించారు. మున్సిపల్ మంత్రి ప్రధుమన్ సింగ్ చేసిన పనికి నెటిజన్లు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com