శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాస శోభ

శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాస శోభ
X

sri

శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణలతో మారుమోగుతోంది. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. తెల్లవారు జామున పాతాళ గంగలో స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రుద్రహోమం, చండీ హోమాలను రెండు విడతలుగా చేస్తున్నారు. తెల్లవారు జామున గం.లకు 2.30 మంగళ వాయిద్యాలు, గం.లకు 2.30 సుప్రభాత సేవ, మహా మంగళ హారతి పూర్తి చేశారు. తర్వాత భక్తులకు దర్శనానికి అనుమతించారు.

రద్దీ ఎక్కువగా ఉన్నందున సుప్రభాతసేవ, మహా మంగళహారతి, లక్ష కుంకుమార్చన, నవావరణపూజ, బిల్వార్చన, 750 రూపాయల అభిషేకం వంటి ఆర్జిత సేవల్ని రద్దు చేశారు. అభిషేకాలు, కుంకుమార్చనలు మాత్రం కొనసాగుతున్నాయి. కార్తీక సోమవారం సందర్భంగా పుష్కరిణి వద్ద దేవస్థానం ఇవాళ లక్షదీపోత్సవం మరియు పుష్కరిణి హారతి నిర్వహిస్తోంది. లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాలు చేపట్టినట్టు ఆలయ అధికారులు చెప్తున్నారు.

అటు, కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన శైవక్షేత్రాలకు సైతం భక్తులు పోటెత్తారు. మహానంది, యాగంటి ఆలయాల్లో వేకువ జామునుంచే ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి మహిళలంతా పంచాక్షరి జపిస్తూ ఆదిదేవుడిని ప్రార్థిస్తున్నారు.

Tags

Next Story