తహసీల్దార్‌ విజయారెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తి

తహసీల్దార్‌ విజయారెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టమ్ పూర్తి

mro-vijaya-reddy

అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ పూర్తయింది. భర్త సుభాష్‌రెడ్డితోపాటు ఇతర కుటుంబ సభ్యుల స్టేట్‌మెంట్లు రికార్డు చేశారు పోలీసులు. అటు ఆస్రత్రికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌ గౌడ్, ఉద్యోగ సంఘాల నేతలు జయారెడ్డి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరంపు విజయారెడ్డి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలతో ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో తీవ్ర విషాదం అలుముకుంది.

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్‌ విజయారెడ్డి హత్యపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. ఈ ఘటన అత్యంత హేయమైందిగా అభివర్ణించారు మంత్రి కేటీఆర్. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇలాంటి ఘటనలకు పాల్పడేవారిని ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించదన్నారు మరో మంత్రి జగదీష్‌రెడ్డి.

అటు ఎమ్మార్వో విజయారెడ్డి హత్యను ఖండించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. ప్రభుత్వ నిర్ణయాల కారణంగానే రెవిన్యూ అధికారులపై ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story