తనకు ప్రమాదం ఉందని ముందుగానే ఊహించిన ఎమ్మార్వో !

తనకు ప్రమాదం ఉందని ముందుగానే ఊహించిన ఎమ్మార్వో !

mro-suresh

తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆఫీసులోనే ఎమ్మార్వోను తగలబెట్టడం ప్రకంపనలు సృష్టించింది. విజయారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని వాపోయారు. సమాచారం తెలిసిన వెంటనే సీపీ మహేష్ భగత్, ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. ఘటనకు దారి తీసిన పరిణామాలపై ప్రాథమిక సమాచారం సేకరించారు. నిందితున్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. భూవివాదమే తహసీల్దార్ హత్యకు కారణమని సీపీ మహేష్ భగత్ తెలిపారు.

ఎమ్మార్వో విజయారెడ్డి తనకు ప్రమాదం ఉందనే విషయాన్ని ముందుగానే ఊహించారా అంటే అవుననే అంటున్నారు బంధువులు. కొద్దిరోజుల క్రితమే కలెక్టర్ ఆఫీసులో సెక్యూరిటీ కావాలంటూ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. భూవివాదాలను ఎక్కవగా డీల్‌ చేయాల్సి వస్తుండటం.. ఎప్పుడూ ఎదో ఒక గొడవ జరుగుతూ ఉండటంతో ఆమె సెక్యూరిటీని నియమించుకోవాలని భావించినట్లు సమాచారం. చివరికి ఆమె భయపడినట్లే జరిగింది. విధుల్లో ఉండగానే ఓ కిరాతకుడి ఘాతుకానికి బలైపోయారు.

Tags

Read MoreRead Less
Next Story