ఫోన్ దొంగిలించిన వ్యక్తిని పట్టుకోవడం కోసం రైలు నుంచి దూకేసరికి..

ఫోన్ దొంగిలించిన వ్యక్తిని పట్టుకోవడం కోసం రైలు నుంచి దూకేసరికి..
X

train

పదిహేను రోజుల క్రితమే ఎంతో ముచ్చటి పడి కొనుక్కున్న ఫోన్ అది. అప్పటి వరకు రైల్లో తన పక్కనే కూర్చుని మంచి చెడు మాట్లాడుతూ మాటలు కలిపిన వ్యక్తికి ఫోన్ గురించి వివరించాడు. ఏదీ ఓసారి ఇవ్వు చూసి ఇస్తాను అంటే ఇచ్చాడు అప్పడే వచ్చిన మరో వ్యక్తికి. ఊహించని విధంగా క్షణంలో ఫోన్ తీసుకుని ఉడాయించాడు. పశ్చిమ బెంగాల్లోని ఉలుబేరియా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఫోన్ తీసుకుని పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం కోసం కదులుతున్న రైల్లోనుంచి దూకడంతో సౌరబ్‌కి తీవ్రంగా గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలోకి వెళ్లిన అతడిని స్థానికులు, రైల్వే పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే సౌరబ్‌కి తీవ్రగాయాలు కావడంతో అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

Next Story