ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో వెలుగు ఉద్యోగుల ఆందోళన

ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడంతో వెలుగు ఉద్యోగుల ఆందోళన
X

ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. పాదయాత్ర సమయంలో తమ జీతం పదివేలు చేస్తామని చెప్పిన సీఎం జగన్‌.. ఐదు నెలలైనా హామీ నెరవేర్చడం లేదంటూ వీఓఏలు, ఆర్‌పీలు ఆందోళనకు దిగారు. అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర 36 గంటల నిరవధిక నిరసన కొనసాగిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి బియ్యం, సరుకులు సేకరించి శిబిరంలోనే వాంటావార్పు చేపట్టారు. రాత్రి అక్కడే నిద్ర కొనసాగించారు. తమ ఆందోళనలో భాగంగా.... ఇవాళ కలెక్టరేట్ల ముట్టడి చేస్తామంటున్నారు. అధికార పార్టీ నాయకుల రాజకీయ వేధింపులు ఆపాలని, వాళ్ల ఒత్తిడితో ఉద్యోగాల నుంచి తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తిరిగి చేర్చుకోవాలని వారు విశాఖలో డిమాండ్ చేశారు.

36 గంటల ఆందోళనలో భాగంగా విజయవాడలో రాత్రి శిబిరాల్లోనే వెలుగు యానిమేటర్లు, రిసోర్స్‌ పర్సన్లు నిద్రపోయారు. జగన్‌ సీఎం అయ్యాక చెప్పిన మాటలు నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. HR పాలసీని వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

అటు మచిలీపట్నం కలెక్టరేట్‌ ముందు ఆందోళన కొనసాగిస్తచున్నారు వెలుగు ఉద్యోగులు. 36 గంటల నిరసన దీక్షలో భాగంగా వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, జీతాలు నేరుగా యానిమేటర్ల అకౌంట్లలో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

విజయనగరంలోనూ VOA, రిసోర్స్‌ పర్సన్స్ ఆందోళన చేపట్టారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు 10 వేల వేతనాన్ని ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 5 నెలలు పూర్తయినా ఇంకా హామీలు నెరవేర్చకపోవడం దారుణమన్నారు. రాజకీయ వేధింపులు ఆపాలని, తొలగించిన VOAలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

అటు.... పశ్చిమగోదావరి జిల్లాలోనూ వెలుగు సిబ్బంది ఆందోళన చేపట్టారు. ఏలూరు కలెక్టరేట్‌ ఎదుట ఆరుబయటే నిద్రపోయారు. సీఎం జగన్‌ తమకిచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ రోజు కలెక్టరేట్‌ ముట్టడిస్తామని హెచ్చరించారు.

Tags

Next Story