భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య.. పరామర్శించనున్న లోకేష్

భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య.. పరామర్శించనున్న లోకేష్
X

Untitled-1

ఏపీలో భవన నిర్మాణ కార్మికుల బలవన్మరణాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారం, పది రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని సర్కారు ఇస్తున్న భరోసా కార్మికుల్లో ధైర్యం నింపడం లేదు. సోమవారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మరో కార్మికుడు సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ మంగళవారం కాకినాడ వెళ్లనున్నారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. కార్మికుల ప్రాణాలు పోతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదని TDP నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.

సూసైడ్ చేసుకున్న వీరబాబుది పెదపూడి మండలం చింతపల్లి గ్రామం. సొంత ఊళ్లో పనుల్లేక ఉపాధి కోసం పట్టణానికి వచ్చినా.. అక్కడా ఖాళీగా ఉండాల్సి రావడం, అప్పుల భారం ఎక్కువవడంతో చివరికి సూసైడ్ చేసుకున్నాడని బంధువులు చెప్తున్నారు. వీరబాబు మరణంతో భార్య, ఇద్దరు పిల్లలు దిక్కులేని వాళ్లయ్యారు.

తూర్పు గోదావరి జిల్లాలో కొన్నాళ్లుగా ఇసుక కొరత తీర్చాలంటూ కార్మికులు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద సోమవారం కూడా ధర్నా చేశారు. ఉపాధి లేని కార్మికుల కుటుంబాలకు రూ.10 వేలు పరిహారం ఇవ్వాలంటూ సీఐటీయూ డిమాండ్ చేసింది.

Next Story