ఉద్యోగులకు ఇన్ఫోసిస్ భారీ షాక్ !

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దిగ్గజం ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఉద్యోగాల్లో భారీగా కోత విధించాలని ఇన్ఫోసిస్ నిర్ణయించింది. సీనియర్ మేనేజర్లు, అసోసియేట్స్‌తో పాటు మిడిల్ బ్యాండ్స్‌లో పనిచేసే ఉద్యోగులను తొలగించడానికి కసరత్తు చేపట్టింది. అసోసియేట్, మిడ్ లెవెల్ పొజిషన్‌లో 10 వేల మంది, మిడిల్, టాప్ లెవెల్ పొజిషన్‌లో 2 వేల 200 మందిని తొలగించే అవకాశ ముంది. మొత్తంగా 12 వేల 200 ఉద్యోగాలకు కోత పడనుంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్లను 50 మందిని తొలగించనుందని అంచనా.
ఇన్ఫోసిస్‌లో అసోసియేట్ లెవల్‌లో 86 వేల మంది, మిడిల్ లెవల్‌లో లక్షా 10 వేల మంది ఉద్యోగులు ఉన్నారు. JL-6, 7, 8 బాండ్లలో 30 వేల మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో అసోసియేట్, మిడిల్ లెవల్‌లో 2-5 శాతం ఉద్యోగుల ను తొలగించాలని ఇన్ఫోసిస్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. JL-6, 7, 8 బాండ్లలో 10 శాతం ఉద్యోగాలకు కోత విధిం చాలని తీర్మానించింది. గతంలో ఇన్ఫోసిస్ నుంచి కొంతమంది ఉద్యోగులను తొలగించారు. ఈసారి ఆ సంఖ్య ఎక్కువగా ఉండడమే హాట్ టాపిక్‌గా మారిది.
ఉద్యోగాల కోతకు ఆర్థిక మందగమనమే కారణమని చెబుతున్నారు. ఇప్పటికే కాగ్నిజెంట్ లాంటి కంపెనీలను ఉద్యో గులను తగ్గిస్తున్నాయి. 7 వేల మందిని తొలగించడానికి కాగ్నిజెంట్ సిద్ధమైంది. సంస్థ వ్యూహాత్మక పునర్నిర్మాణం మరో 6 వేల మంది ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. బీటెక్, ఎంటెక్ చదివి, కంప్యూటర్ కోర్సులు చేసినవారికి ఒకప్పుడు డ్రీమ్ కంపెనీలుగా ఉన్న కాగ్నిజెంట్, ఇన్ఫోసిస్ కంపెనీలు.. ఇలా ఉద్యోగులను తొలగిస్తుండటం నిరు ద్యోగుల్లో కలవరం రేపుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com