జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. గ్రనేడ్ విసిరి..

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్య.. గ్రనేడ్ విసిరి..
X

harising

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల దుశ్చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద టెర్రరిస్టులు గ్రనేడ్‌తో విరుచుకుపడ్డారు. హరిసింగ్ స్ట్రీట్ మార్కెట్ వైపు ఉగ్రవాదులు గ్రనేడ్ విసిరారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా.. 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. బాధితులను సమీప ఆస్పత్రులకు తరలించారు..

గ్రనేడ్‌ దాడితో స్థానికులు ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దం రావడంతో భయంతో పరుగులు తీశారు. వ్యాపార సంస్థలను మూసివేశారు. గత వారం కూడా ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. అక్టోబర్ 28 ఉత్తర కశ్మీర్‌లోని సొపోర్‌లో గ్రనేడ్ విసిరారు. బస్టాండ్ సమీపంలోని ఇక్బాల్ మార్కెట్‌ వద్ద జరిగిన ఆ దాడిలో 19 మంది గాయపడ్డారు. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు టెర్రరిస్టులు.

ఆర్టికల్‌ 370ని రద్దు చేయడం, పీఓకేలోని ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో పడిన ఉగ్రవాదులు... కశ్మీర్‌లో అలజడి సృష్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ దాడులు చేసేది పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులుగా ఆర్మీ అధికారులు అనుమానిస్తున్నారు. గ్రనేడ్‌ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు కూంబింగ్‌ కొనసాగిస్తున్నాయి.

Tags

Next Story