ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు,.

ఇంటర్ అర్హతతో ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు,.
X

పలు ఉద్యోగాలకు ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్ ఎంపీసీ గ్రూప్ విద్యార్ధులకు ఇంజనీరింగ్ విద్యతో పాటు లెప్టినెంట్ ఉద్యోగాన్ని అందిస్తుంది ఇండియన్ ఆర్మీ. ఇందుకోసం 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ కోర్సులో అర్హత సాధించాలి. షార్ట్ లిస్ట్ చేసిన అభ్యర్థులకు రెండు దశల్లో వివిధ పరీక్షలు నిర్వహించి నియామకాలు చేపడతారు. అన్ని విభాగాల్లో అర్హత సాధించినవారికి శిక్షణ నిర్వహిస్తారు. విజయవంతంగా శిక్షణ, కోర్సు పూర్తి చేసినవారికి ఆర్మీలో శాశ్వత ప్రాతిపదికన లెప్టినెంట్ హోదాతో ఉద్యోగం సొంతమవుతుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులతో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజికల్ టెస్టు, రాత పరీక్ష, వైద్య పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మొత్తం పోస్టులు : 90 ఆన్‌లైన్ దరఖాస్తు అక్టోబర్ 15న ప్రారంభమైంది. నవంబరు 13 దరఖాస్తుకు చివరి తేదీ. విద్యార్హత: 10+2 పాసైన విద్యార్థులు అప్లై చేసుకోవాలి. వయసు 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉండాలి.

Next Story