సైనేడ్‌తో ప్రాణాలు తీసిన సైకో అరెస్టు

సైనేడ్‌తో ప్రాణాలు తీసిన సైకో అరెస్టు

fraud

కోస్తా జిల్లాల్లో సంచలనం సృష్టించిన వరుస హత్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సైనేడ్‌తో ప్రాణాలు తీసిన సైకో సింహాద్రిని పోలీసులు అరెస్టు చేశారు. సింహాద్రితో పాటు విజయవాడకు చెందిన షేక్ అమీనుల్లాను కూడా అదుపులోకి తీసుకున్నారు. అమీనుల్లా, సింహాద్రికి సైనేడ్ సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సైనేడ్, 23 కాసుల బంగారం, లక్షా 63 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

సైకో సింహాద్రి వ్యవహారం కోస్తా జిల్లాల్లో కలకలం రేపింది. సైనేడ్ కలిపిన ప్రసాదం పెట్టి పది మందిని హతమార్చాడు. రంగు రాళ్లు, గుప్త నిధులు, బంగారం రెట్టింపు, రైస్ పుల్లింగ్ లాంటి మోసాలతో రూ. 28 లక్షల 50 వేలు కాజేశాడు. అక్టోబర్ 16న డ్రిల్ మాస్టర్ కాటి నాగరాజు హత్య కేసుతో కూడా సింహాద్రికి సంబంధముందని పోలీసులు తెలిపారు. నాగరాజుకు ప్రసాదంలో సైనేడ్ కలిపి పెట్టి హతమార్చినట్లు పోలీసులు వివరించారు.

Tags

Read MoreRead Less
Next Story