అన్న ప్రాణాలు తీసిన చెల్లి

అన్న ప్రాణాలు తీసిన చెల్లి

man

సమాజంలో మానవ సంబంధాలు దారుణంగా దిగజారుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ఆవేషకావేశాలకు లోనే హత్యలకు పాల్పడుతున్నారు. పూజకు పిలవలేదనే కారణంతో ఓ చెల్లి తన అన్నను కొట్టి చంపింది. ఓ గుంపును తీసుకొచ్చి బీభత్సంగా దాడి చేయడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. బిహార్‌లోని నలందలో ఈ దారుణం జరిగింది.

ఉత్తరభారతంలో ఛట్ పూజను ఘనంగా జరుపుకుంటారు. కుటుంబసమేతంగా ఛట్‌ పూజలో పాల్గొంటారు. నలందకు చెందిన జితన్ మాంఝీ, తన ఇంట్లో కూడా ఛట్ పూజ చేసుకున్నాడు. ఐతే, ఈ వేడుకకు తన సోదరి రేఖాదేవిని పిలవలేదు. దాంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. అన్న ఇంటికి వెళ్లి నన్ను పూజకు ఎందుకు పిలవలేదు అని గట్టిగా నిలదీసింది. అక్కడితో ఆగకుండా ఇంటికి వెళ్లి ఆరేడుగురిని తీసుకువచ్చింది. వెదురుకర్రలు, బ్లేడ్లతో వచ్చిన ఆ గ్రూప్, వచ్చీరావడంతో జితన్ మాంఝీపై దాడి చేశారు. మూకుమ్మడిగా దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఇరుగుపొరుగువారు వచ్చి కాపాడేలోపే జితన్ మాంఝీ ప్రాణాలు కోల్పోయాడు.

Tags

Read MoreRead Less
Next Story