5 Nov 2019 12:39 PM GMT

Home
 / 
అంతర్జాతీయం / ఐసిస్‌కు మరో షాక్

ఐసిస్‌కు మరో షాక్

ఐసిస్‌కు మరో షాక్
X

Baghdadi-sister

ఐసిస్‌కు షాక్‌లు మీద షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే ఐసిస్‌ ఛీఫ్‌ను అబూ బకర్ అల్ బగ్దాదీని హతమార్చిన భద్రతా బలాగాలు, తాజాగా బాగ్దాదీ సోదరిని అరెస్టు చేశాయి. బగ్దాదీ అక్క రష్మియా అవద్‌ను ఉత్తర సిరియాలో అదుపులోకి తీసుకున్నారు. అలెప్పోలోని అజాజ్‌ సిటీలో జరిగిన సోదాల్లో ఆమెను అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె టర్కీ బలగాల ఆధీనంలో ఉంది. రష్మియా అరెస్టుతో ఇస్లా మిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ గురించి మరింత సమాచారం తెలిసే అవకాశముందని టర్కీ వర్గాలు పేర్కొన్నాయి. ఉగ్రవాద నిరోధక చర్యల విజయానికి రష్మియా అరెస్టు ఉదాహరణ అని అభివర్ణించాయి.

బగ్దాదీకి ఐదుగురు సోదరులు, సోదరీమణులు ఉన్నారు. ఇందులో ఎంతమంది జీవించి ఉన్నారో స్పష్టంగా తెలీదు. రష్మియా విషయానికి వస్తే ఆమె వయసు 65 ఏళ్లు. భర్త, కోడలు, ఐదుగురు పిల్లలతో కలసి అజాజ్ పట్టణంలో నివసిస్తోంది. ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే అనుమానంపై ఆమెను అరెస్టు చేశారు. రష్మియాతో పాటు ఆమె భర్త, పిల్లలను కూడా అదుపులోకి తీసుకున్నారు. బగ్దాదీతో రష్మియా ఎంతకాలం ఉంది..? ఐసిస్ గురించి ఆమెకు తెలిసిన విషయాలేంటీ..? ఇరాక్‌లో ఐసిస్ నెట్‌వర్క్ గ్రూపుల వివరాలేంటీ..? తదితర కోణాల్లో పోలీసులు ఆమెను ప్రశ్నిస్తున్నారు.

Next Story