సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ అందుకు నిదర్శనం : చంద్రబాబు

ఇసుక కొరతపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. బెజవాడలో నిర్వహించిన టీడీపీ ఎన్నికల వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు ప్రాణాలు పోతుంటే.. మంత్రులు హేళనగా మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఇతర ఏ రాష్ట్రాల్లోను లేని ఇసుక కొరత ఇక్కడే ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఈనెల 14న దీక్ష చేస్తానని చంద్రబాబు ప్రకటించారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన వైసీపీ సర్కారుకు ఏమాత్రం లేదన్నారు చంద్రబాబు. సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం బదిలీ ఇందుకు నిదర్శనం అన్నారాయన. వ్యక్తులను, వ్యవస్థలను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
జగన్ ప్రభుత్వానికి దృష్టిలోపం ఉందని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మందుబాబులనూ వదల్లేదని విమర్శించారు. అన్నిట్లో దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. టీడీపీ బలోపేతం దిశగా ప్రణాళికలు ప్రకటించారు చంద్రబాబు. పార్టీ కమిటీల్లో యువత, మహిళలు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామన్నారు. తెలుగుదేశాన్ని దెబ్బతీయడం ఎవరితరం కాదన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com