తీవ్ర వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీ ప్రజలు

కాలుష్యం కోరల్లో చిక్కుకున్న ఢిల్లీని దోమలు కూడా వణికించేస్తున్నాయి. రాజధాని ప్రాంతంలో డెంగ్యూ కేసులు ఒక్కసారిగా పెరిగిపోవటం ఆందోళనకు గురిచేస్తోంది. గత నెల 26 నాటికి 800 మంది డెంగ్యూ బారిన పడితే..ఈ వారం రోజుల్లోనే 200 మంది ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. దీంతో ఇటీవల కాలంలో ఈ వ్యాధి బారిన పడి, ఆసుపత్రిపాలైనవారి సంఖ్య 1000 మందికి పైగా దాటింది. ఢిల్లీ అధికారులు విడుదల చేసిన నివేదిక ప్రకారం మలేరియా కేసులు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
ఈ ఏడాది జూన్‌లో 11, జూలై 18, ఆగస్టులో 52, సెప్టెంబర్‌లో 190 చొప్పున డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. కానీ, ఈ నెలలో ఏకంగా వెయ్యి కేసులు దాటి పోవటంతో కేపిటల్ సిటీలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అయితే..డెంగ్యూను అరికట్టేందుకుఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే నివారణ చర్యలు చేపట్టింది. 10 వారాలు, 10 రోజులు, 10 నిమిషాలు అనే నినాదంతో డెంగ్యూ దోమల నివారణకు సీఎం కేజ్రీవాల్ ప్రచారం చేపట్టారు.
ఢిల్లీ ప్రజలు ఇప్పటికే వాయు కాలుష్యంతో అల్లాడిపోతున్నారు. మాస్క్ లేకుండా బయటికి రాలేని దుస్థితిలో ఉన్నారు. పొల్యూషన్ ను కట్టడి చేసేందుకు కేజ్రివాల్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలుష్యం ఇష్యూతోనే ఉక్కిరిబిక్కిరవుతున్న నగర జనాలకు ఇప్పుడు డెంగ్యూ భయం కూడా తోడైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com