తహసీల్దార్ హత్యతో నాకెలాంటి సంబంధం లేదు: మంచిరెడ్డి కిషన్ రెడ్డి

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య అనంతరం తనపై వస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఖండించారు. రాజకీయ లబ్ధి కోసమే మల్‌రెడ్డి రంగారెడ్డి బ్రదర్స్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హత్యకేసు నిందితుడి సురేశ్ కుటుంబ సభ్యుల నుంచి.. మల్‌రెడ్డి కుటుంబ సభ్యులు భూమి కొన్నారని ఎమ్మెల్యే మంచిరెడ్డి ఆరోపించారు. అన్ని రకాల ఆధారాలతో మీడియా ముందుకు వచ్చానన్నారు. సదరు 412 ఎకరాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. దీనిపై సీఎంకు, సీఎస్‌కి, డీజీపీకి ఫిర్యాదు చేస్తాను అన్నారు. ఒక ఎమ్మార్వోకి లంచం ఇచ్చి పనులు చేయించుకునే స్థితిలో లేనని కిషన్ రెడ్డి అన్నారు. తహసీల్దార్ హత్య కేసుపై పోలీస్ శాఖ తన పని తాను చేస్తుందన్నారు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com