మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ భారీ కసరత్తు

మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ భారీ కసరత్తు చేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీశారు. గతంలో కీలకంగా ఉండి తటస్థంగా మారిన వారిని.. ఇతర పార్టీల్లో అసంతృప్తులను పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. బీజేపీ ముఖ్య నేతలు.. కొత్తవారితో కలిసి పనిచేస్తే మున్సిపాలిటీలు కైవసం చేసుకోవచ్చని నేతల ఆలోచన. పట్టణాల్లో మౌలిక వసతుల కొరత, ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వ అలసత్వంపై ప్రజలకు అవగాహన కల్పించి.. తమవైపు తిప్పుకోవచ్చని ప్లాన్ చేస్తున్నారు. ప్రతి పౌరుడిని కదిలించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
17 పార్లమెంటు స్థానాల పరిధిలో సమన్వయ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రతి మున్సిపాల్టీకి రాష్ట్రస్థాయి నేతను ఇంచార్జ్‌గా నియమించారు. వారి ఆధ్వర్యంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం జరిపారు. పార్టీ స్థితిగతులు, చేరికలపై చర్చించారు. రిజర్వేషన్ల ప్రకారం అభ్యర్థుల గుర్తింపుపైనా దృష్టి పెట్టారు. రిపోర్ట్స్‌ను రాష్ట్ర కార్యాలయంలో జరిగిన పదాధికారులు, క్లస్టర్, మునిసిపల్ ఇంచార్జ్‌ల సమావేశంలో లక్ష్మణ్‌కు అందజేసారు.
హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఓటమి నేపథ్యంలో.. మున్సిపోల్స్‌పై బీజేపీ ముందుగా కసరత్తు షురూ చేసింది. రాష్ట్ర నాయకత్వం ప్రణాళికలను.. క్షేత్రస్థాయి నాయకులు ఏమేరకు అమలు చేస్తారో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com