ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ 9 గంటల పాటు రివ్యూ

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ 9 గంటల పాటు రివ్యూ

kcr

ఆర్టీసీపై సీఎం కేసీఆర్‌ సుధీర్ఘంగా 9 గంటల పాటు రివ్యూ చేశారు. ఈ సమావేశం అనంతరం.. ఆర్టీసీకి ఎలాంటి బకాయిలు లేవని హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు. అటు ఆర్టీసీ సమ్మె కేసులోనూ హైకోర్టుకు అఫిడవిట్లు సమర్పించారు అధికారులు. ఆర్టీసీ ఎండీ ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమీషనర్‌ నివేదిక ఇచ్చారు. రవాణాశాఖ మంత్రికి సెప్టెంబర్‌ 11నే ఆర్థిక అంశాలు వివరించామని తెలిపారు ఆర్టీసీ ఎండీ. ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి రావాల్సిన దానికంటే రూ.867 కోట్లు ఎక్కువే వచ్చాయని తెలిపారు. జీహెచ్‌ఎంసీకి ఆర్టీసీ ఎలాంటి బకాయి లేదన్నారు సునీల్‌ శర్మ.

Tags

Read MoreRead Less
Next Story