మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేసిన మంత్రి కేటీఆర్

మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులు అందజేసిన మంత్రి కేటీఆర్

ktr

పలు కారణాలతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో బాధిత కుటుంబాలకు బరోసా ఇచ్చారు. ఏ అవసరం వచ్చినా పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. వారితో కలిసి భోజనం చేశారు మంత్రి కేటీఆర్.

అంతకుముందు మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను మంత్రి కేటీఆర్ అందజేశారు. మొత్తం 80 మందికి సాయం అందించారు. ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పున పంపిణీ చేశారు. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన 1,581 మంది టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలకు 31 కోట్ల 62 లక్షలు చెల్లించామని వివరించారు. మిగతా వారికి త్వరలోనే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి చెక్కులు అందజేస్తారని తెలిపారు.

మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను చూడటం బాధగా ఉన్నా... పార్టీ తరఫున అండగా నిలుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉందంటే అది కార్యకర్తల వల్లే అని అన్నారాయన. పార్టీకి 60లక్షల మంది సభ్యత్వం ఉండడం గర్వకారణమని, దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి కూడా ఇంత పెద్ద ఎత్తున సభ్యత్వం లేదన్నారు. 60లక్షల మంది కార్యకర్తలను సీఎం కేసీఆర్ కడుపులో పెట్టి చూసుకుంటారని చెప్పారు కేటీఆర్. దేశంలో ఒకటి రెండు పార్టీలు మాత్రమే బీమా సౌకర్యం కల్పిస్తున్నాయన్నారు. 60లక్షల మంది కార్యకర్తల కోసం ఇన్సూరెన్స్ కంపెనీకి దాదాపు 12 కోట్లు చెల్లించామని తెలిపారు కేటీఆర్.

మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందజేసిన తర్వాత వారితో కాసేపు ముచ్చటించారు. ఎమైనా సమస్యలున్నాయా అంటూ స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

Tags

Next Story