వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి తీవ్రగాయాలు

acci

వనపర్తి జిల్లా మదనాపురం మండలం గోవిందహళ్లి గ్రామ సమీపంలో ఓ ఆటను, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ఓ ప్రయాణికురాలి కుడికాలు పూర్తి తెగిపడింది. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ఆటో మదనాపురం నుంచి కొత్తకోటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను వనపర్తి ఆసుపత్రికి తరలించారు. బాధితులది కొత్తకోట మండలం వడ్డెవాట గ్రామం. ప్రమాదం జరగడంతో రోడ్డుపై చాలా సేపు ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Tags

Read MoreRead Less
Next Story