బాలికపై హత్యాచారం కేసులో మనోహరన్‌కు మరణ శిక్ష ఖరారు

కోయంబత్తూర్‌లో బాలికపై హత్యాచారం కేసులో దోషి మనోహరన్‌కు సుప్రీంకోర్టు మరణశిక్ష ఖరారు చేసింది. ఉరి శిక్షను సవాల్ చేస్తూ మనోహరన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. మనోహరన్ నీచమైన నేరానికి పాల్పడ్డాడని, అతనికి విధించిన మరణశిక్షను సమీక్షించాల్సిన అవసరమే లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. జస్టిస్ నారిమన్, జస్టిస్ సూర్యకాంత్‌లు మనోహరన్ రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించగా, ఇదే బెంచ్‌లో భాగమైన మరో న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా తనకు వేరే అభిప్రాయం ఉందని చెప్పారు. ఐతే, మెజారిటీ జడ్జిమెంట్‌కు అనుగుణంగా రివ్యూ పిటిషన్‌ను కొట్టివేశారు.
2010, అక్టోబర్ 29న మనోహరన్, మోహన కృష్ణన్‌లు స్కూల్‌కు వెళుతున్న బాలిక, ఆమె సోదరుడిని అపహరించారు. బాలిక చేతులు కట్టేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం వారిద్దరిపై విష ప్రయోగం చేశారు. ఆ తర్వాత వారిద్దరినీ పరాంబికులం-అఖియార్ ప్రాజెక్టు కాలువలోకి తోసేశారు. పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మోహన కృష్ణ ప్రాణాలు కోల్పోగా, మనోహరన్ పట్టుబడ్డాడు. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు మనోహరన్‌కు ఉరిశిక్ష విధించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com