ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

ఆర్టీసీ సమ్మెపై విచారణ వాయిదా

tsrtc-hc

ఆర్టీసీ సమ్మెపై విచారణను ఈనెల 11కు వాయిదా వేసింది హైకోర్టు. ప్రభుత్వం, RTC, GHMC సమర్పించిన అఫిడవిట్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక్కొక్కరూ ఒక్కో రకంగా చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. RTC యాజమాన్యం, కార్మికుల మధ్య సయోధ్యకు తాము ప్రయత్నిస్తుంటే ఎవరూ చిత్తశుద్ధితో ముందుకు రావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేసింది.

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. ప్రభుత్వం, ఆర్టీసీ అధికారులు సమర్పించిన అఫిడవిట్లపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వం చెబుతున్న అంకెలు.. ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ.. చెబుతున్న అంకెలు వేర్వేరుగా ఉన్నాయని.. తాము ఏ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలని ప్రశ్నించింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు చాలా తెలివిగా గజిబిజి లెక్కలు, పదాలు వాడారని పేర్కొంది. రుణ పద్దుల కింద కేటాయించిన నిధులు అప్పు కాదని, గ్రాంటు అని తెలివిగా చెబుతున్నారని.. ఇంతవరకు ఏ బడ్జెట్‌లో అలా చూడలేదని వ్యాఖ్యానించింది. మంత్రికి ఆర్టీసీ ఇంఛార్జ్‌ ఎండీ సునీల్ శర్మ తప్పుడు లెక్కలు ఇచ్చారని ఇది ప్రభుత్వాన్ని చీట్ చేసినట్లేనని పేర్కొంది. కేబినెట్‌కి సైతం అధికారులు ఆ తప్పుడు వివరాలే ఇచ్చారని.. వాటి ఆదారంగానే స్టేట్‌మెంట్ ఇప్పించారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags

Next Story