కాలుష్య కోరల్లో యమున

X
By - TV5 Telugu |7 Nov 2019 10:43 AM IST
దేశ రాజధాని ఢిల్లీని వాయుకాలుష్యమే కాదు.. జలకాలుష్యం కూడా వెంటాడుతోంది. యమున నది పూర్తిగా కాలుష్యంతో నిండిపోయింది. ఎగువ ప్రాంతాల్లోని పరిశ్రమల నుంచి వ్యర్ధాల కారణంగా నదిలో రసాయనాల శాతం పెరిగిపోయింది. ఈ రసాయన వ్యర్థాల కారణంగా తెల్లటి నురగ నదిని ఆక్రమించింది. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వాయుకాలుష్యంతో ఇబ్బందులు పడుతున్న తమకు.. రసాయన వ్యర్ధాలు మరింత ప్రమాదంలో పడేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com