నేను భారతదేశానికి వెళ్లను గాక వెళ్లను.. : నీరవ్‌మోదీ

నేను భారతదేశానికి వెళ్లను గాక వెళ్లను.. ఒకవేళ బలవంతంగా పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటా... వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెదిరింపులు ఇవి. లండన్ జైలులో ఉన్న నీరవ్ మోదీకి మరో షాక్ తగి లింది. అతనికి బెయిల్ ఇవ్వడానికి లండన్ కోర్టు తిరస్కరించింది. నీరవ్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించడం ఇది నాలుగోసారి. బెయిల్ పిటిషన్‌పై లండన్ కోర్టులో తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. జైలులో నీరవ్‌పై దాడి జరిగిందని, అతను మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురవుతున్నాడని నీరవ్ తరపు లాయర్ వాదించారు. నీరవ్‌పై భారత మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించారు. అతన్ని భారత్‌కు అప్పగించద్దని కోరారు. బాండ్ మొత్తాన్ని రూ. 18 కోట్ల నుంచి 36 కోట్లకు పెంచుతామని, కండిషన్లు అన్ని పాటిస్తామని చెప్పారు. హౌస్ అరెస్టుకు కూడా సిద్దమని, బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలను కోర్టు పట్టించుకోలేదు. బెయిల్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు. తదుపరి విచారణను డిసెంబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నీరవ్, ఆయన మామ మెహుల్ ఛోక్సిలు ప్రధాన నిందితులుగా ఉన్నారు. రూ.14 వేల కోట్లు ఎగ్గొట్టిన కేసులో వారిద్దరిపై విచారణ జరుగుతోంది. కుంభకోణం బయ ట పడుతున్న సమయంలోనే వారిద్దరూ విదేశాలకు పారిపోయారు. నీరవ్ మోదీ బ్రిటన్‌లో తేలగా, మెహుల్ ఛోక్సి ఆంటిగ్వాలో ఆశ్రయం పొందాడు. 48 ఏళ్ల నీరవ్ మోదీ 2019 మార్చి 19న స్కాట్లాం డ్ యార్డ్‌లో అరెస్టయ్యాడు. ప్రస్తుతం అతన్ని లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఉంచారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com