యాంకర్ ప్రదీప్ ఏమయ్యాడు.. రూమర్స్‌కి చెక్ పెడుతూ..

యాంకర్ ప్రదీప్ ఏమయ్యాడు.. రూమర్స్‌కి చెక్ పెడుతూ..

pradeep

నాన్‌స్టాప్‌గా నవ్వులు పూయించే మేల్ యాంకర్ ప్రదీప్.. కొన్ని రోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తమ అభిమాన యాంకర్ ఇలా సడెన్‌గా మాయమయ్యేసరికి విషయం ఏంటో తెలియక ఏవేవో ఊహించుకున్నారు. ఎన్నెన్నో కథలు అల్లేశారు. ఫిమేల్ యాంకర్లలో సుమకి ఉన్న క్రేజ్ ఎంతో, మేల్ యాంకర్లలో ప్రదీప్ కూడా అంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో బాగా పాపులరైన షో ఢీ జోడీ.. ఇందులో ప్రదీప్, సుధీర్, రష్మీలు చేసే కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్పిందే. పార్టిసిపెంట్స్ చేసే డ్యాన్స్‌తో సమానంగా.. వీరు పండించే కామెడీకి అభిమానులు ఫిదా అవుతారు.

నెల రోజులు ఇంట్లో ఉన్నా బోర్ కొట్టలేదంటూ సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చాడు ప్రదీప్. ఇప్పటి వరకు నేను చేసే షోలు మీరు చూశారు. ఇన్ని రోజులు మీరు నా గురించి రాసినవి చదువుతూ నేను ఎంజాయ్ చేశాను. ఇన్ని రోజులు కనపడకపోయేసరికి నాకేదో అయిపోయిందని రకరకాల హెడ్డింగులు పెట్టి రాసినవి చూసి నవ్వుకున్నాను. అయితే ఇప్పుడు నిజం చెబుతున్నాను. నాకేమీ కాలేదు.. షూటింగ్ చేస్తున్నప్పడు కాలికి దెబ్బతగలడంతో డాక్టర్లు సర్జరీ చేసి నిల్చోవద్దని చెప్పారు. అసలే షోస్ అన్నీ నిలబడే చేయాల్సి వుంటుంది.

పోనీ ఆ గాయమేదో చేతికి అయినా మాట్లాడుతూ మేనేజ్ చేయొచ్చు. కాలికి కాబట్టి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలా ఖాళీగా ఉండడం అలవాటు లేని పని కావడంతో ఇంట్లో వాళ్లు నేను ఎక్కడ పారిపోతానో అని దిండు మీద పెట్టి మరీ పడుకోబెట్టారని చెప్పుకొచ్చాడు. మరేం బెంగ పడకండి.. ఇంకో వారం రోజుల్లో వచ్చేస్తున్నాడు ప్రదీప్ మీ ముందుకు మరిన్ని నవ్వులు పూయించడానికి అంటూ లైవ్ చేసాడు. దాంతో అభిమానులు కాస్త ఊరట చెందారు.

Read MoreRead Less
Next Story