మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం

మరో కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం
X

cm

ఇప్పటికే మద్యం షాపుల నిర్వహణకు పలు నిబంధనలు విధించిన ఏపీ ప్రభుత్వం తాజాగా బార్లపై దృష్టిసారించింది. రాష్ట్రంలో బార్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయించింది. జనవరి 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని ఆదేశించారు సీఎం జగన్‌. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆదాయార్జన శాఖలపై సమీక్ష నిర్వహించిన సీఎం.. ఈ మేరకు విధివిధానాలు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు ఇబ్బందిలేని ప్రాంతాల్లో మాత్రమే బార్లు ఉండాలని, అనుమతి ఇచ్చే ప్రదేశాల్లో అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు కొనసాగుతున్న బార్లను.. రాత్రి 10 గంటల వరకే కొనసాగించేలా నిర్ణయించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే బార్లలో మద్యం అమ్మేందుకు అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ, రవాణ, అబ్కారీ, స్టాంపులు, రిజిస్ట్రేషన్‌, అటవీ, మైనింగ్‌ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజయ్యారు. శాఖల వారీగా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం ప్రస్తుత పరిస్థితులను సీఎంకు వివరించారు అధికారులు.

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బార్ల సంఖ్య పెద్ద మొత్తంలో తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 840 బార్లు ఉండగా... ఇందులో 588 బార్లకే అనుమతి ఇవ్వనున్నారు. బార్ల లైసెన్స్‌లను రద్దు చేసి కొత్త లైసెన్సులకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు.

Tags

Next Story