కొడుకు, కుక్కా ఒకటేనా అక్కా.. మలైకాను ఆడుకుంటున్న నెటిజన్లు..

కొడుకు, కుక్కా ఒకటేనా అక్కా.. మలైకాను ఆడుకుంటున్న నెటిజన్లు..

malika

పెట్స్‌ని ప్రేమించు.. కానీ పిల్లలకంటే ఎక్కువగా ప్రేమిస్తానంటే ఎలా తల్లీ. పట్టించుకుంటేనే పక్కదారి పడుతున్నారు. మరి కుక్కని అంత బాగా పట్టించుకుని కొడుకుని పట్టించుకోపోతే వాడు ఎలా తయారవుతాడో ఏమో.. నలభై ఏళ్లు వచ్చినా ఏ మాత్రం నాజుకు తగ్గని బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరాను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఐటెం డ్యాన్సర్‌గా అభిమానులను సంపాదించుకున్న మలైకా డాగ్ లవర్. క్యాస్పర్ అనే పొమేరియన్ జాతికి చెందిన కుక్కను ఆమె ఎంతో ప్రాణంగా పెంచుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. కానీ ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ నా దృష్టిలో కొడుకు, కుక్కా ఒక్కటే. ఇద్దర్నీ ఒకేలా ప్రేమిస్తాను అంది. అంతే నెటిజన్స్ చేతిలో అడ్డంగా బుక్కయింది.

నా 17 ఏళ్ల కొడుకు అర్హాన్ కూడా ఓ సారి ఇలానే అడిగాడు. నాకంటే నీకు మన పెట్ క్యాస్పర్ అంటేనే ఎక్కువ ఇష్టం కదూ అని. దానికి నేను ఇద్దరూ సమానమే అని చెప్పాను. పెట్స్‌నుంచి మనకు నిస్వార్థమైన ప్రేమ లభిస్తుంది. నేను సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్‌లకు కామెంట్లు వస్తుంటాయి. కానీ నేను వాటిని పట్టించుకోను. నాగురించి తెలిసిన వారి గురించి మాత్రమే ఆలోచిస్తాను. కామెంట్లు చేసే వారి మానసిక స్థితి సరిగా లేదేమో అని నా అభిప్రాయం అని మలైకా వెల్లడించారు. కాగా, మలైకా మొదటి భర్త అర్బాజ్ ఖాన్‌తో విడిపోయింది. ఇప్పుడు తనకంటే పదేళ్లు చిన్నవాడైన అర్జున్ కపూర్‌తో ప్రేమలో పడింది. ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోనున్నట్లు ప్రకటించింది.

Read MoreRead Less
Next Story