150 రోజుల పాలనలో 630 కేసులు పెట్టారు : చంద్రబాబు

150 రోజుల పాలనలో 630 కేసులు పెట్టారు : చంద్రబాబు
X

babu

చిత్తూరు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పుంగనూరు నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం కూడా రివ్యూ చేయనున్నారు. ప్రభుత్వం అక్రమకేసులతో వేధిస్తోదంటూ కార్యకర్తలు చంద్రబాబు ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారని....కొందరిపై రౌడీ షీట్ కూడా తెరిచారని తెలిపారు.

వైసీపీ తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలను వేధించడం మానుకోవాలని హెచ్చరించారు.. 150 రోజుల పాలనలో టీడీపీ నేతలపై 630 కేసులు పెట్టారని.. తప్పుడు కేసులపై న్యాయపోరాటం చేస్తామన్నారు..

చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు చంద్రబాబు . టీడీపీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టినవారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చట్టవ్యతిరేక పనులు చేయకపోవడం వల్లే సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేశారని ఆరోపించారు చంద్రబాబు..

అటు జగన్ తీరుపై ట్విట్టర్‌లో విమర్శించారు చంద్రబాబు. జగన్ నివాసం కోసం ప్రభుత్వ ఖజానా నుంచి 15 కోట్ల రూపాయలు తరలి వెళ్లడం దిగ్భ్రాంతికి గురిచేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రం రగిలిపోతుంటే జగన్ మాత్రం తన విలాసవంతమైన ఇంట్లో బిజీగా ఉన్నారని ఆరోపించారు.

Tags

Next Story