కాలుష్యం కంట్రోల్ చేసేందుకు జీహెచ్‌‌ఎంసీ కీలక నిర్ణయం..

కాలుష్యం కంట్రోల్ చేసేందుకు జీహెచ్‌‌ఎంసీ కీలక నిర్ణయం..

hyd

హైదరాబాద్ మహానగరంలో కాలుష్యం పెరుగుతోంది. గాలిలో నాణ్యత తగ్గుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే ఢిల్లీ తరహాలో దారుణంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఏయిర్ ఫ్యూరిఫైయర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే కౌన్సిల్ స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. తొలిదశలో సుమారు కోటిన్నరతో 100 ప్రాంతాల్లో ఎయిర్ ప్యూరి ఫైయర్స్ పెట్టాలని భావిస్తున్నారు.

భాగ్యనగరంలో స్వచ్ఛమైన గాలి దొరకడం లేదు. నాణ్యత గణనీయంగా పడిపోతోంది. గాలిలో 0 నుంచి 100 మైక్రో గ్రామ్స్ ఇన్ క్యూబిక్ మీటర్- MGQM వరకూ ఉంటే.. ఫర్వాలేదు. కానీ నగరంలో చాలా ప్రాంతాల్లో 150 MGQM దాటుతోంది. జూపార్కు, సనత్ నగర్, బేగంపేట వంటి ప్రాంతాల్లో 150 MGQM వరకూ నమోదు అవుతోంది. బొల్లారం, హెచ్ సి యూ, పటాన్ చెరు, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. దీంతో వంద చోట్ల ఎయిర్ ఫ్యూరిఫైయర్ల ఏర్పాటు చేయాలని బల్దియా నిర్ణయించింది. ప్రతిపాదనలకు గురువారం స్టాండింగ్ కౌన్సిల్ చర్చించి ఆమోదం తెలిపింది. బహుగుణ టెక్నోమోటీవ్స్ సంస్థ వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది.

కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న ఢిల్లీ, గోవా, పూనె ప్రాంతాల్లో ఇప్పటికే ఎయిర్ ఫ్యూరిఫైయర్స్ ఏర్పాటు చేశారు. ఇటీవల తాజ్ మహల్ వద్ద కూడా అమర్చారు. దీని చుట్టూ 60 అడుగుల దూరంలో కాలుష్య వాయువులను పరికరం పీల్చుకుంటుంది. ఇంటిగ్రేషన్ కంట్రోల్ ప్యానల్ రిమోట్ ద్వారా పనిచేసే పరికరంలోని ఇన్ లెట్ లోకి కాలుష్య వాయువులు వెళతాయి. పిల్ట్రేషన్ సిస్టమ్ లో గాలి శుద్ధి జరుగుతుంది. అందులోని నుంచి శుద్ధి చేసిన గాలి విడుదల అవుతుంది. దీంతో కాలుష్యం తీవ్రత తగ్గుతుంది. అంతేకాదు.. గాలిలో కాలుష్యం తీవ్రతను కూడా ఇవి గుర్తించి డిస్ ప్లే చేస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story