పది పాసైతే చాలు.. పోస్ట్‌ఆఫీస్‌లో ఉద్యోగం.. 5,476 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్..

భారత ప్రభుత్వానికి చెందిన తపాలా సంస్థ ఇండియా పోస్ట్ వేర్వేరు సర్కిళ్లలో 10వేలకు పైగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీ ప్రక్రియను చేపట్టింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఉన్న మొత్తం 5476 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తోంది. కనీసం 10వతరగతి పాసైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు లెక్కలు, ఇంగ్లీషు సబ్జెక్టులతో 10వ తరగతి పాసై ఉండాలి. 10వ తరగతి కంపార్ట్‌మెంట్‌లో పాసైనవారికంటే మొదటి ప్రయత్నంలో పాసైన వారి దరఖాస్తులనే పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. మరియు అభ్యర్థులకు స్థానిక భాషపై పట్టు ఉండాలి.
అభ్యర్ధులకు 60 రోజుల వ్యవధి గల బేసిక కంప్యూటర్ ట్రైనింగ్ కోర్స్ సర్టిఫికెట్ ఉండాలి. ఏదైనా కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఈ సర్టిఫికెట్ పొందిన వారు అర్హులు. వయసు.. 2019 లక్టోబర్ 15 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది.
మొత్తం పోస్టులు : 5476.. తెలంగాణలో 970.. ఆంధ్రప్రదేశ్‌లో 2707, చత్తీస్‌గఢ్‌లో 1799 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2019 అక్టోబర్ 22.. దరఖాస్తుకు చివరి తేదీ: 2019 నవంబర్ 21. ఇక జీతం విషయానికి వస్తే లెవెల్ 1 ఉద్యోగులకు రూ.12,000, లెవెల్ 2 ఉద్యోగులకు రూ.14,500. మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: http://www.appost.in చూడవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com