రోహిత్‌ తుఫాన్‌.. బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్

రోహిత్‌ తుఫాన్‌.. బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకున్న భారత్

Untitled-2

బంగ్లాదేశ్ పై ప్రతీకారం తీర్చుకుంది భారత్. రోహిత్ శర్మ సునామీ ఇన్నింగ్స్ తో రాజ్ కోట్ టీ-ట్వంటీలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో సిరీస్ ను 1-1తో సమం చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. 6 వికెట్లకు 153 పరుగులు చేసింది. 154 టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్..26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తిచేసింది. వందో టీ-ట్వంటీ ఆడిన రోహిత్ శర్మ బంగ్లా బౌలర్లను ఊచకోత కోసేశాడు. దీంతో రాజ్ కోట్ బౌండరీలు, సిక్సర్లతో దద్దరిల్లిపోయింది. 45 బంతుల్లోనే 85 పరుగులు చేసి టీమిండియా విక్టరీలో కీ రోల్ ప్లే చేశాడు.

హిట్ మ్యాన్ హిట్టింగ్ తో బంగ్లాదేశ్ చేష్టలుడి చూస్తుండిపోయింది. ఆడిన రెండో బాల్నే బౌండరీ బాదేసిన రోహిత్ ఇక..తన స్టైల్ బ్యాటింగ్ తో శివాలెత్తిపోయాడు. 24 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ శర్మ..ఆ తర్వాత మరింత చెలరేగిపోయాడు. ఆరు ఫోర్లతో పాటు కళ్లు చెదిరే ఆరు సిక్సర్లు బాదటంతో టీమిండియా స్కోరు పరుగులు పెట్టింది. సెంచరీ మ్యాచ్ లో సెంచరీ దిశగా దూసుకెళ్తున్నట్లు కనిపించినా..85 పరుగుల వ్యక్తిగత స్కోరు దగ్గర భారీ షాట్ కు ప్రయత్నించి క్యాచ్ ఔటయ్యాడు.

మరో ఎండ్ లో శిఖర్ ధవన్ కూడా రాణించాడు. 27 బాంతుల్లో 31 పరుగులు చేశాడు. ఓపెనర్లు తఇద్దరు పెవిలియన్ చేరే సమయానికి టీమిండియా స్కోరు 12 ఓవర్లలో 125 పరుగులకు చేరింది. దీంతో బంగ్లా ఓటమి దాదాపుగా ఖాయమైపోయింది. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 3 ఫోర్లు, ఓ సిక్సర్ లాంఛనాన్ని పూర్తి చేశాడు. దీంతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. సీరిస్ నిర్ణయాత్మక మూడో టీ-ట్వంటీ మ్యాచ్ నాగ్ పూర్ వేదికగా జరగనుంది.

Tags

Read MoreRead Less
Next Story