అమెరికా- చైనా ట్రేడ్ వార్ ఎట్టకేలకు ముగిసే దిశగా అడుగులు..

అమెరికా- చైనా ట్రేడ్ వార్ ఎట్టకేలకు ముగిసే దిశగా అడుగులు..

us-chaina

అమెరికా- చైనా.... ప్రపంచ గమనాన్ని మార్చే శక్తిమంతమైన దేశాలివి. ఏడాదికిపైగా ఈ రెండు శక్తివంతమైన దేశాల మధ్య ముదిరిన ట్రేడ్ వార్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఇది కలవరపెట్టింది. ఒకరిపై ఒకరు పోటాపోటీగా ప్రతీకార సుంకాలను పెంచుకుంటూ వెళ్లాయి. కొన్ని కొన్ని ఉత్పత్తులపై ఏకంగా వంద శాతం సుంకాలను విధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ ప్రతీకార వడ్డింపులతో ఆర్ధికంగా జరుగుతున్న నష్టంపై రెండు దేశాల్లో ఆందోళన నెలకొన్నా..వెనక్కి తగ్గలేదు. అప్పుడప్పుడు చర్చలు జరిగినా ఫలితం లేకుండా పోయింది.

ఏడాదికిపైగా కొన సాగుతున్న ట్రేడ్ వార్ ఎట్టకేలకు ముగిసే దిశగా అడుగులు పడుతున్నాయి. దశలవారీగా ఇప్పటిదాకా విధించుకున్న ప్రతీకార సుంకాలను వెనుకకు తీసుకునేందుకు చైనా, అమెరికాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా ఇరు దేశాలూ ఒకరి ఉత్పత్తులపై మరొకరు విధిస్తూ వచ్చిన సుంకాలను రద్దు చేసేందుకు అంగీకరించినట్లు చైనా వాణిజ్య మంత్రిత్వశాఖ తెలిపింది. గత రెండు వారాలుగా ఇరు దేశాలకు చెందిన ప్రతినిధులు సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నారు. ఇరు దేశాల మధ్య వ్యక్తమైన ఆందోళనలపై చర్చించడంతో పాటు..అదనంగా విధించిన సుంకాలను దశలవారీగా వెనక్కి తీసుకునేందుకు అంగీకారానికి వచ్చారు. ఒప్పందంలో భాగంగా ఇరు దేశాలు సమాన నిష్పత్తిలో ఒకేసారి గతంలో విధించిన సుంకాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించినట్లు చైనా వివరించింది.

వానిజ్య యుద్ధం పరిష్కారానికి ఓ అవగాహణకు వచ్చినట్లు చైనా ప్రకటించినా..అటు ఆమెరికా నుంచి మాత్రం ఇంకా స్పష్టమైన ప్రకటన ఏదీ ఇంకా వెలువడలేదు. రెండు దేశల మధ్య గతంలో చర్చలు జరిగినా అర్ధాంతరంగా నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమెరికా స్పందనపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. ఆమెరికాలోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న చైనా ఉత్పత్తులు తమ దేశ సంపదను దోచుకుపోతున్నాయన్నది ట్రంప్ వాదన. అందుకే చైనా వస్తువులపై సుంకాలను పెంచుతూ వచ్చారు. ప్రతీకారంగా చైనా కూడా ఆమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచుతూ వచ్చింది. అయితే..ఆమెరికా నుంచి ప్రకటన రాకున్నా..టారీఫ్‌ల ఉపసంహరణతో తొలి దశ ఒప్పందం జరిగిందని చైనా చెబుతోంది. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్.. వచ్చే నెలలో లండన్‌లో కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాణిజ్య యుద్ధానికి తెరదించే ఒప్పందాలపై ఈ సమావేశంలోనే సంతకం చేసే అవకాశం ఉంది.

Tags

Read MoreRead Less
Next Story