ఇంకా లభ్యం కానీ రెండు నెలల చిన్నారి ఆచూకీ.. తల్లిదండ్రుల ఆందోళన

ఇంకా లభ్యం కానీ రెండు నెలల చిన్నారి ఆచూకీ.. తల్లిదండ్రుల ఆందోళన
X

నెల్లూరు జిల్లా కావలిలో రెండ్రోజుల క్రితం అపహరణకు గురైన 2 నెలల చిన్నారి ఆచూకీ లభ్యం కాలేదు. సీసీఫుటేజ్‌ ద్వారా పాపను కిడ్నాప్ చేసిన మహిళను పోలీసులు గుర్తించారు. ఫోన్ సిగ్నల్ ఆధారంగా ఆమె ఆచూకీ కనుగొనే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ లాభం లేకపోయింది. రెండ్రోజులైనా కిడ్నాపర్‌ను పోలీసులు పట్టుకోలేకపోయారు. మరోవైపు.. తమ చిన్నారి కోసం తల్లిదండ్రులు కావలిలోనే ఉన్నారు. తమ పిల్లలతో కలిసి నిద్రాహారాలు మానేసి ఎదురుచూస్తున్నారు. తమ చిన్నారి ఎలా ఉందో అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

Tags

Next Story