టిక్‌టాక్‌ మాయలో పడి మోసపోయిన ఇద్దరు యువతులు

టిక్‌టాక్‌ మాయలో పడి మోసపోయిన ఇద్దరు యువతులు

tik-tok

సోషల్‌ నెట్‌వర్కింగ్‌ యాప్‌ టిక్‌టిక్‌ మరో ఇద్దరు యువతుల ప్రాణాలతో చెలగాటం ఆడింది. ఇద్దరు మాయగాళ్ల వలలో పడిన యువతులు ఏకంగా 600 కిలోమీటర్లు ప్రయాణించి.. తాము మోసపోయినట్లు తెలుసుకుని వాపోయారు. సిద్ధిపేట జిల్లా ముక్తా మస్తాన్‌ పల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువతులు టిక్‌టాక్‌లో తమకు పరిచయం అయిన వంశీ, స్వామి అనే యువకులను ప్రేమించారు. మాటా మాటా కలిసి విషయం పెళ్లి వరకు వెళ్లింది. యువకుల మాయమాటలు నమ్మిన యువతులు.. వారిని కలిసేందుకు అనంతపురం జిల్లా దర్గా వన్నూరుకు చేరుకున్నారు. తీరా అక్కడికెళ్లే సరికి ఇద్దరు యువకులు మాట మార్చారు. పంచాయతీ పెద్దలు విషయం చెప్పినా పరిష్కారం లభించకపోవడంతో యువతులిద్దరూ.. పోలీసులను ఆశ్రయించారు. ఎస్సై రమణారెడ్డి యువతులను విచారించి కళ్యాణదుర్గంలోని ఉజ్వల హోమ్‌కు తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం అందించారు.

Tags

Read MoreRead Less
Next Story