పిల్లి ఎంత పని చేసింది.. పిల్లాడిని.. వీడియో వైరల్

పిల్లి ఎంత పని చేసింది.. పిల్లాడిని.. వీడియో వైరల్

cat

అమ్మానాన్న ఎక్కడికి వెళ్లారో.. హాల్లో వాడిని ఒక్కడినే వదిలేశారు. కనీసం ఆయమ్మ కూడా దగ్గర లేనట్టుంది. ఎవరు లేరురా బుజ్జిగా.. నిన్ను చూసుకునే డ్యూటీ నాదే అన్నట్లు పిల్లి వాడి కదలికల్ని గమనిస్తోంది. పాలు తాగే ఆ పసివాడు పాకుతూ మెట్ల అంచు దగ్గరకు వెళ్లి పోయాడు. అది గమనించిన పిల్లి వెంటనే దూకి వచ్చి అచ్చంగా మనుషులు అడ్డుకున్నట్లే ఆ చిన్నారిని మెట్ల మీద నుంచి పడిపోకుండా రక్షించింది. పిల్లి ఆ పని చేయకపోతే పిల్లాడి పరిస్థితి ఏమై ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉందంటూ సీసీ కెమెరాలో చూసిన తల్లిదండ్రులు భయపడిపోయారు. తమ బిడ్డను కాపాడిన పిల్లికి జీవితాంతం రుణపడి ఉంటామంటూ .. తాము పెంచుకుంటున్న పిల్లి తమకు చేసిన సాయం మరువలేనిదని ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అందరితో పంచుకున్నారు. పెట్స్ ప్రేమను పంచుతాయి.. ప్రాణాలూ కాపాడతాయని మరోసారి రుజువైంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Read MoreRead Less
Next Story