తిరుపతిలో ఘోరం.. ఉద్యోగినితో బలవంతంగా మద్యం తాగించి..

తిరుపతిలో దారుణం వెలుగుచూసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగినితో సహోద్యోగులు నీచంగా ప్రవర్తించారు. ఆమెతో బలవంతంగా మద్యం తాగించి.. ఆపై అత్యాచారానికి యత్నించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు.. దాంతో బాధితురాలు ఆత్మహత్యా యత్నం చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

కొంతకాలంగా తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని పనిచేస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన వర్సిటీ ఐఎఫ్‌ఎల్‌సీ విభాగంలో పనిచేసే ముగ్గురు నాన్ టీచింగ్ రెగ్యులర్ ఉద్యోగులు ఆమెకు బలవంతంగా మద్యం తాగించి అత్యాచార యత్నం చేసినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. తాను దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. ఈ ఘటన యూనివర్సిటీలో కలకలం రేపుతోంది.

Read MoreRead Less
Next Story