చాయ్‌లో చెంచా బెల్లం.. చెంచా అల్లం వేసుకుని తాగితే..

బెడ్ మీద నుంచి లేస్తూనే ఓ కప్పు వేడి వేడి చాయ్ పడితే కానీ పన్లు జరగవ్. మరి ఆ చాయ్‌లో చక్కెర వేసుకుని తాగే బదులు కాస్త బెల్లం, అల్లం వేసి తాగారనుకోండి పొట్ట క్లీనవుతుంది. అదేనండి మలబద్దకం సమస్య ఉండదు. మంచిది కదా అని అదే పనిగా రోజుకి అయిదారు టీలు తాగకూడదు. కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఉదయం ఓ కప్పు, సాయింత్రం ఓ కప్పు తాగితే ఆరోగ్యం. అంతకు మించి తాగితే లేనిపోని ఇబ్బందులు. చాయ్‌లో చక్కెర వేసుకుని తాగితే చక్కెర శరీరంలోకి వెళ్లి అధిక క్యాలరీలకు ఆస్కారమవుతుంది. అదే బెల్లం వాడితే అధిక బరువుని అదుపులో ఉంచుకోవచ్చు. బెల్లం ఉండే ఐరన్ రక్త హీనతను నివారిస్తుంది. దీంతో పాటు శరీరంలోని అవయవాలకు రక్త సరఫరా పెరుగుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ఫ్రీ ర్యాడికల్స్ చేసే నష్టాన్ని తగ్గిస్తాయి. ఇక అల్లం విషయానికి వస్తే శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, అలర్జీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com